రెండవ పాస్‌పోర్ట్.. రేట్లు పెంచిన కరేబియన్ దేశాలు..‘స్కెంజెన్’కు ప్రాధాన్యత..!!

- September 23, 2024 , by Maagulf
రెండవ పాస్‌పోర్ట్.. రేట్లు పెంచిన కరేబియన్ దేశాలు..‘స్కెంజెన్’కు ప్రాధాన్యత..!!

యూఏఈ: విదేశాలలో రెండవ పాస్‌పోర్ట్ కోసం చూస్తున్న యూఏఈ వ్యక్తులు కరేబియన్ నుండి స్కెంజెన్ దేశాలకు మారుతున్నారు. ఇటీవల కరేబియన్ దేశాలు పెట్టుబడి కార్యక్రమం ద్వారా వారి పౌరసత్వం ఇచ్చే రేట్లను పెంచారు. అయితే, ఇప్పటికీ కరేబియన్ దేశాల పాస్‌పోర్ట్‌లకు డిమాండ్ ఉందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు.   

యూరోపియన్, స్కెంజెన్ ప్రాంతాలతో సహా దాదాపు 150 దేశాలకు వీసా-రహిత యాక్సెస్‌ను అందిస్తూ, కరేబియన్ పాస్‌పోర్ట్‌లకు డిమాండ్ ఉంది.  సలహా సంస్థ సిటిజన్‌షిప్ ఇన్వెస్ట్ ప్రకారం.. నాలుగు కరేబియన్ దేశాలు ఆంటిగ్వా & బార్బుడా, డొమినికా, గ్రెనడా , సెయింట్ కిట్స్ & నెవిస్ మార్చి 2024లో తమ పాలసీలలో మార్పులు చేశాయి. కొన్ని కరేబియన్ దేశాలు పెట్టుబడి వ్యయాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా పెంచాయని సమానా గ్రూప్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ఉరుసా ఇమ్రాన్ తెలిపారు. ఆసియా, మధ్యప్రాచ్య దేశాల నుండి చాలా మంది పెట్టుబడిదారులు కరేబియన్ దేశాల నుండి రెండవ పాస్‌పోర్ట్‌లను పొంది అక్కడ స్థిరపడటానికి కాకుండా వీసా-రహిత ప్రయాణ యాక్సెస్ కొరకు తీసుకుంటున్నారని వెల్లడించారు.  కరేబియన్‌ పాస్ పోర్టుతో ప్రజలు 145 దేశాలకు వీసా-రహిత ప్రయాణం చేయొచ్చని తెలిపారు. 500,000 యూరోల పెట్టుబడితో పోర్చుగల్ పాస్‌పోర్ట్‌ను పొందవచ్చని ఇమ్రాన్ సూచించారు.

డొమినికా: కనీస పెట్టుబడిని $100,000 నుండి $200,000కి పెంచింది. అయితే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి కనిష్టంగా $200,000 వద్ద ఉంది.

ఆంటిగ్వా మరియు బార్బుడా: ఆగస్ట్ లో అప్‌డేట్ చేసిన ప్రకారం.. ఫండ్ కంట్రిబ్యూషన్‌ . $130,000 నుండి $230,000 కు పెంచారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి $300,000 (గతంలో $200,000)కి పెంపుదల చేశారు.

గ్రెనడా: కనీస సహకారం $150,000 నుండి $235,000 లేదా రియల్ ఎస్టేట్ పెట్టుబడి $270,000 (గతంలో $200,000)కి సవరించారు. 

సెయింట్ లూసియా: CBI ప్రోగ్రామ్ ఇప్పుడు $240,000 ($100,000 గతంలో) , రియల్ ఎస్టేట్ రంగంలో $300,000 ($200,000 నుండి) ప్రారంభమవుతుంది.

సెయింట్ కిట్స్, నెవిస్: నలుగురితో కూడిన కుటుంబం వరకు ఒకే దరఖాస్తుదారు కోసం కనీస పెట్టుబడి $250,000గా ఉంది. ఇది గతం పెట్టుబడితో పోలిస్తే రెండింతలైంది. రియల్ ఎస్టేట్ రంగంలో కనీస పెట్టుబడి $400,000 గా నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com