మహేష్ బాబు న్యూ లుక్ చూశారా.?
- September 23, 2024
సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్స్‌లోకి మారిపోయారు. ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత మహేష్ బాబు ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అదే జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ. ఈ సినిమాని రాజమౌళి ఏ రేంజ్లో తెరకెక్కించబోతున్నాడన్నది ఆల్రెడీ కొన్ని అంచనాలైతే వుంటాయ్ ఆడియన్స్‌కి.
ఆ అంచనాలకు తగ్గట్లుగానే మహేష్ బాబు లుక్స్ కూడా వుండాలి కదా. అందుకే సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నాడు మహేష్ బాబు.
పొడుగాటి జుట్టు, గెడ్డంతో డిఫరెంట్ స్టైలిష్ మేకోవర్ అది. రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లోని భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల కారణంగా తన వంతుగా కోటి రూపాయలు చెరో 50 లక్షల చొప్పున అనౌన్స్ చేశారు మహేష్ బాబు.
అందులో భాగంగానే తెలంగాణా సీఎంని తాజాగా మహేష్ బాబు కలిసి చెక్ అందించారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా కలవనున్నారనీ తెలిపారు.
ఈ సందర్భంలో బయటికొచ్చిన ఫోటోల కారణంగానే మహేష్ న్యూ లుక్ రివీల్ అయ్యింది. ఈ లుక్‌లో మహేష్‌ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..