శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం.. ప్రమాణం చేస్తుండగా భూమనను అడ్డుకున్న పోలీసులు

- September 23, 2024 , by Maagulf
శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం.. ప్రమాణం చేస్తుండగా భూమనను అడ్డుకున్న పోలీసులు

తిరుమల: శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం మరింత రాజుకుంటోంది. శ్రీవారిని సన్నిధిలో టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రమాణం చేస్తుండగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని భూమనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

తన తప్పేమీ లేదంటూ తిరుమల శ్రీవారి ఆలయంలో భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రమాణం చేయడానికి వెళ్లారు. అంతకుముందు ఆయన పుష్కరిణీలో పవిత్ర స్నానం చేశారు. అలాగే, అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించచి, ఆ తర్వాత స్వామి వారి ఆలయం ఎదుటకు వెళ్లారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.

భూమన మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల వల్ల తన మనసు కలత చెందుతోందని అన్నారు. శ్రీవారి కేంద్రంగా రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధమని చెప్పారు. కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. తాను తప్పు చేసి ఉంటే తన కుటుంబం సర్వ నాశనం అయిపోవాలని అన్నారు. తాను ఏ రాజకీయ మాట మాట్లాడలేదని భూమన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com