దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్

- September 24, 2024 , by Maagulf
దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్

భారత్: దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భారత్ లో మరోసారి మంకీపాక్స్ కేసు నమోదు అయింది. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. గత కొన్ని రోజులుగా మంకీపాక్స్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే గత ఐదేళ్ల కిందట కరోనా కేసులు కూడా ఇలాగే ఒకటి, రెండు, మూడు పెరుగుతూ ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించింది. 

కాంగో సహ పలు దేశాలను కలవరపెడుతోంది ఈ మంకీపాక్స్. తాజాగా భారత్ లోనూ వ్యాప్తి చెందింది. భారతదేశంలో మంకీపాక్స్ కేసు మరొకటి నమోదయింది. మూడో మంకీపాక్స్ కేసుకు సంబంధించిన వివరాలు ఇంకా వెలువడలేదు. రోగి ఇటీవలే దుబాయ్ నుంచి భారతదేశానికి రావడం జరిగింది. అతడు కేరళ వాసి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలియజేసింది. విచారణ నివేదికలో బాధితుడికి మంకీపాక్స్ కు చెందిన క్లాడ్ 1బి వైరస్ సోకినట్టుగా తెలిసింది. 

ఇటీవల కేరళలోని మలప్పురంలో రెండవ కేసు బయటకు వచ్చింది. ఆ వ్యక్తి కూడా యూఏఈ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినట్లుగా సమాచారం. ప్రాథమిక లక్షణాలు కనిపించిన తర్వాత రోగిని పరీక్షించి మంకీపాక్స్ వ్యాధి సోకినట్లు వెళ్లడైంది. విదేశీ ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరైనా సరే ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని కేరళ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com