అక్టోబర్ 1 నుండి షాపింగ్ మాల్స్‌లో బయోమెట్రిక్ సేవలు బంద్..!!

- September 25, 2024 , by Maagulf
అక్టోబర్ 1 నుండి షాపింగ్ మాల్స్‌లో బయోమెట్రిక్ సేవలు బంద్..!!

కువైట్: షాపింగ్ మాల్స్‌లో బయోమెట్రిక్ వేలిముద్రలు తీసుకోవడం అక్టోబరు 1వ తేదీ నుంచి నిలిపివేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే,  బయోమెట్రిక్ సేవలు పబ్లిక్ డిపార్ట్‌మెంట్‌లోని వ్యక్తిగత గుర్తింపు ధృవీకరణ విభాగాలలోని కేంద్రాలలో అందుబాటులో ఉంటాయన్నారు. ఇది వారం పొడవునా ఉదయం 8:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు పనిచేస్తుందన్నారు. అపాయింట్‌మెంట్ బుకింగ్ ను సహెల్ అప్లికేషన్ ద్వారా చేయవచ్చునని, బయోమెట్రిక్ వేలిముద్రలను 360 మాల్, అవెన్యూస్, అల్-అస్సిమా, మినిస్ట్రీస్ కాంప్లెక్స్ షాపింగ్ మాల్స్‌లో సెప్టెంబర్ 30 వరకు అపాయింట్‌మెంట్ లేకుండా చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com