ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ
- September 25, 2024
అమరావతి: నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. దాదాపు 20 కార్పొరేషన్లకు చైర్మన్లను అపాయింట్ చేసింది. ఇందులో టీడీపీ 16, జనసేన 3, బీజేపీకి 1 పోస్టును కేటాయించింది. నామినేటెడ్ పోస్టుల్లో ఏపీ ఆర్టీసీ(APSRTC) ఛైర్మన్ గా కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ (APSRTC)వైస్ చైర్మన్ గా మునిరత్న, శాప్ చైర్మన్ గా రవి నాయుడు, ఏపీఐఐసీ చైర్మన్ గా మంతెన రామరాజు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ హజీజ్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య నాయుడు, ట్రైకార్ చైర్మన్ శ్రీనివాసులు, మారి టైం బోర్డ్ చైర్మన్ సత్య, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్యం సుబ్బారెడ్డి,
టూరిజం చైర్మన్ బాలాజీ, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి, పద్మాశాలి సంక్షేమ సంస్థ చైర్మన్ గా నందం అబద్దయ్య, ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పీలా గోవింద సత్యనారాయణ, లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పిల్లి మాణిక్యాలరావు, ఏపీ స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్ పర్సన్ గా పీతల సుజాత, ఏపీ ఎమ్ఎస్ఎమ్ఈ కార్పొరేషన్ చైర్మన్ గా తమ్మిరెడ్డి శివశంకర్, పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా తోట మెహర్ సీతారామ సుధీర్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా వజ్జా బాబు రావు, ఏపీ టిడ్కో చైర్మన్ గా వేణుములపాటి అజయ్ కుమార్ ను నియమించింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్