గ్లోబల్ సేఫ్టీ సర్వే.. అత్యంత సురక్షితమైన దేశాలలో బహ్రెయిన్..!!

- September 25, 2024 , by Maagulf
గ్లోబల్ సేఫ్టీ సర్వే.. అత్యంత సురక్షితమైన దేశాలలో బహ్రెయిన్..!!

మనామా: గ్లోబల్ సేఫ్టీ సర్వే బహ్రెయిన్‌ను ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాలలో ఒకటిగా పేర్కొంది. సెప్టెంబరు 24న విడుదల చేసిన సర్వేలో బహ్రెయిన్‌లో నివసిస్తున్న 87% మంది రాత్రిపూట ఒంటరిగా నడవడం సురక్షితమని భావిస్తున్నారట.  Gallup గ్లోబల్ సేఫ్టీ రిపోర్ట్ ఇతర GCC దేశాల అధిక భద్రతా రేటింగ్‌లను కూడా హైలైట్ చేసింది. కువైట్ ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత ర్యాంకింగ్‌ను సాధించింది. 99% మంది రాత్రిపూట ఒంటరిగా నడవడం సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. సౌదీ అరేబియా, యూఏఈ వరుసగా 92% , 90% స్కోరును సాధించాయి. బహ్రెయిన్ యొక్క 87% స్కోర్ సాధించగా, ఇది స్విట్జర్లాండ్ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువ కావడం గమనార్హం.  ప్రపంచవ్యాప్తంగా 2023లో 70% మంది పెద్దలు రాత్రిపూట ఒంటరిగా నడవడం సురక్షితంగా భావించారని, మధ్యప్రాచ్యం ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో 74%కి పెరిగిందని గాలప్ తన నివేదికలో సూచించింది. సోలో మహిళా ప్రయాణికులకు అత్యంత సురక్షితమైన G20 దేశంగా సౌదీ అరేబియా ఉత్తమ ర్యాంకింగ్ సాధించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com