విధుల్లో ఉండగా ప్రమాదం..నలుగురు సైనికులు మృతి..!!
- September 25, 2024
యూఏఈ: డ్యూటీలో ఉండగా జరిగిన ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి చెందగా, మరో 9 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో నలుగురు సాయుధ దళాల సభ్యులు మరణించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 24 సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారని తెలిపారు. గాయపడిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించి, అవసరమైన వైద్య సంరక్షణను అందిస్తున్నారు. వారు త్వరగా కోలుకోవాలని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. తమ వీర జవాన్లను కోల్పోయినందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. అమరవీరుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేసింది. కాగా, ఫిబ్రవరిలో సోమాలియాలో ఉగ్రవాదుల దాడిలో సాయుధ దళాలకు చెందిన నలుగురు సభ్యులతోపాటు ఒక బహ్రెయిన్ అధికారి మరణించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!