రియాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్, ఎగ్జిబిషన్‌ ప్రారంభం..!!

- September 25, 2024 , by Maagulf
రియాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్, ఎగ్జిబిషన్‌ ప్రారంభం..!!

రియాద్:  రియాద్‌లో సౌదీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్, ఎగ్జిబిషన్‌ను రియాద్ రీజియన్ మేయర్, రియాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ సెంటర్ (RIPC) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ప్రిన్స్ ఫైసల్ బిన్ అయ్యఫ్ ప్రారంభించారు. సౌదీ అరేబియాతోపాటు విదేశాలకు చెందిన పలువురు మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సౌదీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్, ఎగ్జిబిషన్ నగరాలను అభివృద్ధి చేయడానికి,  స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి సహకారాన్ని అందిస్తుందని మేయర్ తన ప్రారంభ ప్రసంగంలో పేర్కొన్నారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ లు మౌలిక సదుపాయాల రంగానికి అపూర్వమైన మద్దతును అందిస్తున్నారని తెలిపారు.   సమ్మిట్‌ సందర్భంగా సెషన్‌లు, వర్క్‌షాప్‌లతోపాటు పలు స్థానిక, అంతర్జాతీయ సంస్థల మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com