పవన్ కళ్యాణ్‌కి క్షమాపణలు చెప్పిన తమిళ హీరో కార్తీ.!
- September 25, 2024
తన సినిమా ‘సత్యం సుందరం’ రిలీజ్‌కి వున్న నేపథ్యంలో తమిళ హీరో కార్తీ తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్లు నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జరిగిన ఓ ఈవెంట్లో ప్రస్తుతం సీరియస్‌గా నడుస్తోన్నితిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి టాప్ వచ్చింది.
ఆ టాపిక్ చాలా సెన్సిటివ్.. ఇప్పుడు మాట్లాడొద్దు.. అని కార్తీ దాటేయడం, కింద నుంచి అభిమానుల కేరింతలు కొట్టడంతో ఆ ఇష్యూ అక్కడ కామెడీ అయిపోయింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.
దాంతో, ఇది చాలా సీరియస్ ఇష్యూ.. సినీ నటులు ఇలా కామెడీ చేయొద్దు.. అంటూ దీన్ని ఓ ఉద్యమంలా చేపట్టి, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కాస్త గుస్సా అయ్యారు.
దాంతో, కార్తీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తన వుద్దేశ్యం అది కాదనీ, సనాతర ధర్మంపై తనకూ గౌరవముందనీ.. పవన్ కళ్యాణ్‌కి సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పారు.
కార్తీ పోస్ట్‌కి పవన్ స్పందిస్తూ.. కార్తి నటించిన సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే, కార్తి సోదరుడు సూర్య కూడా పవన్ కళ్యాణ్ పోస్ట్‌కి రెస్పాండ్ అయ్యారు. కార్తి నటించిన ‘సత్యం సుందరం’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!