‘దేవర’ సినిమాపై బెట్టింగులు.!

- September 25, 2024 , by Maagulf
‘దేవర’ సినిమాపై బెట్టింగులు.!

‘ఆచార్య’ సినిమా తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న సినిమానే ‘దేవర’. మొదట్లో కాస్త నెగిటివిటీ వున్నప్పటికీ, రిలీజ్ డేట్ దగ్గరకొచ్చేసరికి విపరీతమైన హైప్ పెరిగింది.

ఇది నిజంగానే పెరిగిన హైపా.? లేక పెయిడా.? అనేది తెలియాలంటే రిలీజ్ డే వరకూ ఆగాల్సిందే. అయితే, ఈ సినిమాకి ఎక్స్‌ట్రా షోలకు పరిమితులు లభించాయ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే షోలు పడనున్నాయ్.

టాక్ బాగుంటే ఓకే. టాక్ ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతి. అయితే, భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఎన్టీయార్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

నమ్మడమే కాదు, ఏకంగా భారీ స్థాయిలో బెట్టింగులు కూడా కట్టేస్తున్నారు. అయితే, గుర్తు పెట్టుకోవాల్సిందేంటంటే కొరటాల శివ ఓ డిజాస్టర్ తర్వాత రూపొందించిన సినిమా ఇది.
ఇలాంటి బెట్టింగులు ఎంతవరకూ సబబు.? వెరీ డేంజరస్ అంటూ కొందరు సినీ మేథావులు హెచ్చరిస్తున్నారు. కానీ, ఎన్టీయార్ ఫ్యాన్స్ దూకుడు మాత్రం ఆపడం లేదు.

అలాగే ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయ్. అనూహ్యమైన స్థాయిలో టికెట్ బుకింగ్స్ జరిగాయని సమాచారం. అలాగే, చిరంజీవి, పవన్ కల్యాణ్ నుంచి ‘దేవర’కి ఫుల్ సపోర్ట్ రావడంతో, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా వున్నట్లే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com