55 కిలోల కొకైన్ స్వాధీనం.. అరటిపండ్ల రవాణాలో దాచి..అడ్డుకున్న కస్టమ్స్..!!
- September 26, 2024
రియాద్: రాబిగ్ గవర్నరేట్‌లోని కింగ్ అబ్దుల్లా పోర్ట్‌లోని జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ అధికారులు 54.8 కిలోల మాదక ద్రవ్యాల కొకైన్ స్మగ్లింగ్ ప్రయత్నాలను విఫలం చేశారు. ఓడరేవు ద్వారా రాజ్యానికి వచ్చిన అరటిపండ్ల రవాణాలో వాటిని దాచి స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు. అరటిపండు కంటైనర్లపై అనుమానంతో స్క్రీనింగ్ ద్వారా తనిఖీలు చేయగా.. భారీగా కొకైన్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు అథారిటీ తెలిపింది. సెప్టెంబరులో కింగ్ అబ్దుల్లా ఓడరేవు వద్ద ఇది రెండవ అతిపెద్ద డ్రగ్స్ రవాణా. ఈ నెల ప్రారంభంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC), జకాత్ కస్టమ్స్ అథారిటీ సహకారంతో 236 కిలోగ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా సమాచారం తెలిస్తే (1910) లేదా ఇమెయిల్ ([email protected]), అంతర్జాతీయ నంబర్ (00966114208417) ద్వారా తెలిపి ప్రతి ఒక్కరూ సహకరించాలని అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







