బహ్రెయిన్ స్కూల్ గేమ్స్ 2024.. ISF ప్రతినిధి బృందం పరిశీలన..!!
- September 28, 2024
మనామా: ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ISF) నుండి ఒక ప్రతినిధి బృందం ఇటీవలే అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ బహ్రెయిన్‌ని సందర్శించింది. అక్టోబరులో రాబోయే అంతర్జాతీయ స్కూల్ గేమ్స్ "బహ్రెయిన్ 2024" కోసం సౌకర్యాలను పరిశీలించింది. ఈ ఈవెంట్ 80 కంటే ఎక్కువ దేశాల నుండి 5,000 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.
బహ్రెయిన్‌లో జరుగుతున్న ఆరవ స్కూల్ గేమ్స్ వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ స్కూల్ గేమ్స్‌కు పునాది వేయనున్నాయి. ఈ పోటీలు యువ క్రీడాకారులను అభివృద్ధి చేయడానికి, వారిని అంతర్జాతీయ సవాళ్లకు వారిని సిద్ధం చేయడానికి కీలకమైనవని అధికారులు తెలిపారు. అథ్లెట్లు బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, బీచ్ వాలీబాల్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, కరాటే, చెస్, బ్యాడ్మింటన్, టైక్వాండో, జూడో, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, సైక్లింగ్, క్రికెట్, పాడెల్, సెయిలింగ్‌తో సహా 19 విభిన్న క్రీడాంశాలలో పోటీ పడుతున్నారు.
స్పోర్ట్స్ డైరెక్టర్ సౌరభ్ మిశ్రా, ఈవెంట్ డైరెక్టర్ ఉరోస్ సావిక్తో సహా ISF ప్రతినిధి బృందం ఏరియల్ జిమ్నాస్టిక్స్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, చెస్‌లకు సంబంధించిన కీలక వేదికలను పరిశీలించింది. సౌకర్యాల పట్ల డెలిగేషన్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!