ఖతార్ నేషనల్ విజన్ 2030.. పాదచారుల భద్రతకు పెద్దపీట..!!
- September 28, 2024
దోహా: పాదచారులతో సహా వాహనదారుల భద్రతను పెంపొందించేందుకు కొత్త ప్రదేశాల్లో పాదచారుల క్రాసింగ్‌ల ఏర్పాటు ప్రాజెక్ట్‌లో పాదచారుల క్రాసింగ్‌ల సంఖ్యను రాబోయే సంవత్సరాల్లో 50 నుండి 200కి పెంచాలని రవాణా మంత్రిత్వ శాఖ (MoT) యోచిస్తోంది. పాదచారుల క్రాసింగ్లలో ఓవర్‌పాస్‌లు, అండర్‌పాస్‌లు, క్రాస్‌వాక్‌లు ఉన్నాయి.
"పాదచారుల క్రాసింగ్ ప్లాన్‌ను నవీకరించడానికి ప్రస్తుతం ఒక అధ్యయనం జరుగుతోంది.దీని ఫలితంగా కొత్త క్రాసింగ్లను నిర్మించడం లేదా ఇప్పటికే ఉన్న వాటిని అప్‌గ్రేడ్ చేయడం జరుగుతుంది" అని రవాణా మంత్రిత్వ శాఖలోని ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సలేహ్ సయీద్ మొహమ్మద్ అల్ మర్రి అన్నారు. రహదారి డిజైన్లు లేదా ట్రాఫిక్ నియంత్రణ సాధనాల ద్వారా భద్రత స్థాయిని పెంచుతామన్నారు. బస్సులు, కార్లతో సహా వాహనాలకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయని అల్ మర్రి తెలిపారు. ముఖ్యంగా సైక్లిస్టులు, పాదచారుల భద్రతపై దృష్టి సారించడానికి ఈ అధ్యయనం నిర్వహించబడుతోందన్నారు. ఖతార్ నేషనల్ విజన్ 2030,రవాణా మంత్రిత్వ శాఖ యొక్క వ్యూహానికి అనుగుణంగా సురక్షితమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా వ్యవస్థను నిర్మిస్తోందని ఆయన అన్నారు. అదే సమయంలో ప్రమాదాల రేటును తగ్గించడం, ప్రయాణ సమయ వ్యవధిని తగ్గించడం కూడా ఈ ప్రణాళిక లక్ష్యం అని అల్ మర్రి వివరించారు. "2030 నాటికి ఖతార్ ప్రజా రవాణా బస్సు వ్యవస్థను 100% ఎలక్ట్రిక్ ఫ్లీట్‌గా క్రమంగా మార్చాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రస్తుతం, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ రేటు 70% దాటింది." అని అన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!