దుబాయ్ మిరాకిల్ గార్డెన్.. ఎంట్రీ ఫీజు తగ్గింపు..!!
- September 28, 2024
దుబాయ్: దుబాయ్ మిరాకిల్ గార్డెన్ (DMG).. అందరికి ఇష్టమైన ఫ్యామిలీ థీమ్ పార్క్ సెప్టెంబర్ 28 నుండి ప్రారంభం అవ్వనుంది. ఇపుడు నివాసితులకు ఎంట్రీ ఫీజు తగ్గించారు. ఎమిరేట్స్ IDని చూపడం ద్వారా పెద్దలు, పిల్లలు ఒక్కొక్కటి Dh60కి ఫ్లోరల్ పార్క్‌లోకి ప్రవేశించవచ్చు. గత సంవత్సరం ధర Dh65 ఉండగా, తాజాగా Dh5 తగ్గించారు. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉచితంగా ప్రవేశించవచ్చు.
అయితే, పర్యాటకులు, యూఏఈ యేతర నివాసితుల కోసం టిక్కెట్ ధరలు 5 Dhలు పెరిగాయి. ఇప్పుడు పెద్దలకు Dh100, పిల్లలకు Dh85 గా నిర్ణయించారు. సెప్టెంబర్ 28 నుంచి ఆన్లైన్ బుకింగ్‌ను స్వీకరించడం ప్రారంభిస్తామని డీఎంజీ ప్రకటించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద సహజ పూల తోటగా పేర్కొనబడిన DMG ప్రతి సంవత్సరం దాదాపు 120 రకాల 150 మిలియన్లకు పైగా సహజ పుష్పాలను ప్రదర్శిస్తుంది. గార్డెన్ విభిన్న థీమ్‌లను కలిగి ఉంది. దుబాయ్ల్యాండ్లో ఉన్న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ మొదటిసారి ప్రేమికుల దినోత్సవం, ఫిబ్రవరి 14, 2013న ప్రారంభించారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది.వారాంతాల్లో (శనివారం, ఆదివారం) ప్రభుత్వ సెలవు దినాల్లో ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!