బహ్రెయిన్ లో దూసుకుపోతున్న లగ్జరీ కార్ మార్కెట్.. E- ట్రెండ్స్ ఫుల్ డిమాండ్..!!
- September 28, 2024
మనామా: బహ్రెయిన్ వినియోగదారులు విలాసవంతమైన కార్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ ఏడాది మార్కెట్ ఆదాయం $43 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుదల ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వైపు చెప్పుకోదగ్గ మార్పుతో పాటు హై-ఎండ్ SUVలకు డిమాండ్ కారణంగా సాధ్యమైందని చెబుతున్నారు. బహ్రెయిన్ యొక్క లగ్జరీ కార్ మార్కెట్ ఈ సంవత్సరం $43 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించగలదని స్టాటిస్టా నుండి ఇటీవలి నివేదిక అంచనా వేసింది. 2028 వరకు 12.19% వార్షిక వృద్ధి రేటుతో $67 మిలియన్ల మార్కెట్ చేరుతుందని అంచనా వేస్తున్నారు. 2024లో అమ్మకాలు 600 యూనిట్లకు చేరుకోవచ్చని తెలిపారు. దీని సగటు ధర $105,000కి చేరుకుంటుందని చెబుతున్నారు. గత సంవత్సరంలో బహ్రెయిన్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలలో స్థిరమైన పెరుగుదలను రిపోర్ట్ వెల్లడించింది. ప్రపంచ స్థాయిలో అమెరికా విలాసవంతమైన కార్ల ఆదాయాల్లో టాప్ పొజిషన్ లో ఉంది. 2024లో $6,654 మిలియన్ల ఆదాయాన్ని అంచనా వేస్తుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!