యూఏఈలో 20% తగ్గనున్న బాస్మతీయేతర బియ్యం ధరలు..!!
- September 30, 2024
యూఏఈ: కమోడిటీ పై ఎగుమతి నిషేధాన్ని భారత్ తొలగించిన తర్వాత యూఏఈలో బాస్మతీయేతర బియ్యం ధరలు దాదాపు 20 శాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం బాస్మతి, బాస్మతియేతర బియ్యం రెండు మిలియన్ల టన్నులతో యూఏఈకి బియ్యం దిగుమతిలో భారతదేశం అతిపెద్ద భాగస్వామిగా ఉంది. ఇదిలా ఉండగా, భారతదేశం బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని తొలగించింది. టన్నుకు $490 (దాదాపు Dh1,800) ధరను నిర్ణయించింది. దక్షిణాసియా దేశంలో మెరుగైన పంటల దిగుబడి కారణంగా ఎగుమతిపై ఉన్న ఆంక్షలను తొలగించింది. సెప్టెంబర్ 28, 2024న భారత వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ మార్పు కారణంగా యూఏఈ మార్కెట్‌లో ధరలను దాదాపు 20 శాతం తగ్గే అవకాశం ఉందని అల్ ఆదిల్ సూపర్‌మార్కెట్ల ఛైర్మన్ డాక్టర్ ధనంజయ్ దాతర్ అన్నారు. యూఏఈలో బాస్మతీయేతర బియ్యం అత్యంత వేగంగా అమ్ముడవుతుంది. మార్కెట్ వాటాలో దాదాపు 70 శాతం వాటా కలిగి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్‌లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







