జెడ్డా పురాతన మార్కెట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరు ఫైర్ ఫైటర్స్ మృతి..!!
- September 30, 2024
జెడ్డా: సౌదీఅరేబియాలో పురాతన మార్కెట్లలో ఒకటైన జెడ్డా ఇంటర్నేషనల్ మార్కెట్లో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా దుకాణాలు దగ్ధం అయ్యాయి. ఈ క్రమంలో మంటలను ఆర్పుతూ సివిల్ డిఫెన్స్‌కు చెందిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారు. ఆదివారం ఉదయం 6:00 గంటలకు అల్-రౌదా జిల్లాలోని మదీనా రోడ్‌కు సమీపంలో ఉన్న మార్కెట్లో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. దాదాపు 14 గంటల పాటు కష్టపడి ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పారని సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ తన ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటనలో ప్రకటించింది. విధులు నిర్వహిస్తూ మరణించిన అక్రమ్ జుమా అల్-జోహ్నీ, అబ్దుల్లా మనాహి అల్-సుబైల అమరవీరులకు డైరెక్టరేట్ సంతాపం తెలిపింది. జెడ్డా, మక్కా నుండి 20 కంటే ఎక్కువ అగ్నిమాపక రెస్క్యూ యూనిట్లు ఇందులో పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







