సౌదీ నుంచి ఇండియా చేరుకున్నారు నిర్మల్ వాసి
- October 01, 2024
హైదరాబాద్: సీఎం రేవంత్ చొరవతో సౌదీ నుంచి ఇండియా చేరుకున్నారు నిర్మల్ వాసి. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువ్వికి చెందిన రాథోడ్ నామదేవ్ అనే వ్యక్తి బతుకు తెరువు కోసం 5 నెలల క్రితం ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లాడు. కువైట్ లో హౌస్ కీపింగ్ పని అని చెప్పి నామదేవ్ ను సౌదీలో ఒంటెల కాపరిగా ఏజెంట్...పెట్టారు. అయితే ఏజెంట్ చిత్రహింసలు భరించలేక తనను ఎలాగైనా ఇండియా రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు రాథోడ్ నామదేవ్.
ఇక సెల్ఫీ వీడియోపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... రాథోడ్ నామదేవ్ ను ఇండియా రప్పించే చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. సీఎంఓ అధికారులు...సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి రాథోడ్ నామదేవ్ ను ఇండియా రప్పించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి రాథోడ్ నామదేవ్ కుటుంభం ధన్యవాదాలు తెలిపారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..