హైదరాబాద్‌లో డీజేల పై నిషేధం
- October 01, 2024
హైదరాబాద్: హైదరాబాద్‌లో నిర్వహించే ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్‌ను నిషేధిస్తూ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని డయిల్ 100కు ఫిర్యాదులు పెరగడంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజేల అంశంపై ఇటీవల బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బల్దియా కమిషనర్ ఆమ్రపాలి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజాసింగ్, పాషాఖాద్రీ, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సీవీ ఆనంద్ డీజేలపై నియంత్రణ అవసరాన్ని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండేళ్లుగా డీజేలతో పెద్దయెత్తున నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని, ఈసారి శృతిమించి జరిగిందని, సీఎం రేవంత్‌రెడ్డి సైతం దీన్ని గమనించి ఆరా తీశారని సీవీ ఆనంద్ అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక నుంచి చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!