దుబాయ్ వ్యాపార కేంద్రాల్లో ట్రాఫిక్ జామ్‌.. పార్కింగ్ స్థలాల్లో టైమ్ వృధా..!!

- October 02, 2024 , by Maagulf
దుబాయ్ వ్యాపార కేంద్రాల్లో ట్రాఫిక్ జామ్‌.. పార్కింగ్ స్థలాల్లో టైమ్ వృధా..!!

యూఏఈ: దుబాయ్‌లోని కార్యాలయాలు, వ్యాపార కేంద్రాల చుట్టూ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోంది. ఆ ప్రాంతంలోని చాలా మంది నివాసితులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ బఫర్ సమయాన్ని గడపాల్సి వస్తుందని వాపోతున్నారు. ముఖ్యంగా బిజినెస్ బే, డిఐఎఫ్‌సి, దీరాతో సహా పలు వ్యాపార జిల్లాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ను ఎదుర్కొంటున్నారు.

బిజినెస్ బేలోని మరాసి డ్రైవ్‌లోని బే టవర్‌లో పని చేస్తున్న ఇంజనీర్ అవైస్ అహ్మద్  మాట్లాడుతూ.. "పీక్ అవర్స్‌లో పార్కింగ్ నుండి బయటకు రావడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుంది" అని తెలిపాడు. పార్కింగ్ స్థలానికి అనుసంధానించే రోడ్లు ఒక్కొక్కటిగా వాహనాలతో నిండిపోతాయన్నారు.    "అల్ ఖైల్ రోడ్ లేదా ఇతర ఎక్స్‌ప్రెస్‌వేలలోకి వెళ్లడానికి 25 నిమిషాలకు పైగా పడుతుంది. ఆపై అల్ నహ్దాలోని నా ఇంటికి చేరుకోవడానికి మరో 40 నిమిషాలు పడుతుంది." అని వివరించాడు.   గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ పెరగడం నిత్యకృత్యమైందని DIFCలో నివసిస్తున్న మీడియా ప్రొఫెషనల్ అర్ఫాజ్ ఇక్బాల్ తెలిపారు.  “గత రెండు నెలల్లో ఈ ప్రాంతం చుట్టూ ట్రాఫిక్ చాలా దారుణంగా మారింది. ఇది ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ ఇప్పుడు ఉదయం 5.30 గంటలకే ఎక్కువ కార్లు ఉంటున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రతి అంతర్గత రోడ్డు బిజీగా మారుతుంది. ఈవెనింగ్ బిల్డప్ దాదాపు సాయంత్రం 4 గంటలకు మొదలై రాత్రి 8 గంటల వరకు ఉంటుంది." అని ఇక్బాల్ తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com