గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ అనుగ్రహం
- October 04, 2024
విజయవాడ: ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పిస్తారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. మహత్తర శక్తిగల జగన్మాత ఐదు ముఖాలతో వరదాభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో కోలాహలం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కాగా, నేడు దుర్గమ్మను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హరినాథ్, జస్టిస్ దుర్గాప్రసాద్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), సీపీ రాజశేఖర్బాబు తదితరులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







