రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- October 04, 2024
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. కాగా, ఈ మ్యాచ్‌కు సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక ఈ మ్యాచ్ దసరా పండుగ రోజున (అక్టోబర్ 12) జరగనుండగా….. ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయంపై హెచ్‌సీఏ తాజా అప్డేట్ వచ్చింది.
రేపటి (అక్టోబర్ 5) నుంచి ఈ మ్యాచ్ టిక్కెట్లను ఆన్లైన్లో విక్రయిస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పేటిఎం యాప్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అయితే ఈసారి మాత్రం ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు అమ్మడం లేదని ఆయన స్పష్టం చేశారు.
టిక్కెట్ల ధర రూ.750 నుంచి రూ.15 వేల వరకు ఉందన్నారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జింఖానా గ్రౌండ్స్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్రింటవుట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డు చూపించి టిక్కెట్లు పొందవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!