నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- October 05, 2024
నిజమాబాద్: నిజమాబాద్ లో అన్యోన్యంగా సాగుతున్నా ఓ కుటుంబం కుమారుడు ఆన్లైన్ బెట్టింగు అప్పులు ఎక్కువై సుమారు 18 లక్షల అప్పులతో మోయలేని భారంతో నలుగురిలో తిరగలేక శుక్రవారం రాత్రి ముగ్గురు కుటుంబ సభ్యులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎడపల్లి మండలం వడ్డపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగనేని. సురేష్ భార్య హేమలత కుమారుడు హరీష్ అన్యోన్యంగా సాగుతున్న కుటుంబం గత 20 సంవత్సరాల నుండి వ్యవసాయంతో పాటు కిరాణా షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు ఈ క్రమంలో కుమారుడా హరీష్ ఆన్లైన్ బెట్టింగ్లతో పాటు అప్పులు చేయడంతో ఎక్కువ మోతాదుల అప్పులు కావడంతో తల్లిదండ్రులు గతంలో 0.20 గుంటల భూమిని అమ్మి గతంలో అప్పులను చెల్లించారు అయినా కుమారుడు తీరుమారక అప్పులు ఆన్లైన్ బెట్టింగ్లతో సుమారు 18 లక్షలు అప్పులు కావడంతో అప్పుల వారు ఆన్లైన్ వారి ఒత్తిడి కావడంతో నలుగురిలో తిరగలేక మనస్తాపం చెంది శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు వారి ఇంట్లో చీరల సహాయంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు
శనివారం ఉదయం పక్కన ఉన్న పొరుగువారు లేవకపోవడంతో డోర్ ను కొట్టిన తియక కపోవడంతో ఇంటి వెనకల ఉన్న కిటికీ గుండా చూడడంతో ముగ్గురు ఉరివేసుకొని ఉండటం గమనించి ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించగా ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణ రెడ్డి ఘటన స్థలం చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించి పంచనమ నిర్వహించి మృతదేహాలకు పోస్టు మార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబంలో ముగ్గురికి ముగ్గురు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం పట్ల వడ్డపల్లి గ్రామంలో తీవ్ర విషాదాలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







