ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ప్రమాదం..వాహనం బోల్తా..!!

- October 05, 2024 , by Maagulf
ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ప్రమాదం..వాహనం బోల్తా..!!

దుబాయ్: మీరు షార్జాకు వెళుతున్నారా. అవును అయితే, వెంటనే షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్‌ను బదులుగా మరో ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సిందే. ఎందుకంటే రద్దీగా ఉండే ఆ ప్రధాన రహదారిపై వాహనం బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ మేరకు దుబాయ్ పోలీసులు Xలో వెల్లడించారు.ప్రమాదానికి గురైన వాహనం షార్జా వైపు వెళ్తుండగా ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. సాధారణంగా 6.9కిలోమీటర్లు దాటడానికి 4 నిమిషాల సమయం పట్టే ఈ మార్గంలో ఇప్పుడు వాహనదారులు 35 నిమిషాల వరకు ప్రయాణించాల్సి వస్తోంది.  వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని దుబాయ్ పోలీసులు సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com