‘బిగ్’ ఛేంజ్.! యష్మి ఎందుకలా మారిపోయింది.?

- October 05, 2024 , by Maagulf
‘బిగ్’ ఛేంజ్.! యష్మి ఎందుకలా మారిపోయింది.?

బిగ్‌బాస్ గేమ్ షోలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు.ఎవరు ఎలాగైనా మారిపోవచ్చు. మొదట మంచిగా అనిపించిన వాళ్లు, కొన్ని వారాలు గడిచాకా చెడ్డవాళ్లుగా చిత్రీకరించబడొచ్చు.
అదంతా బిగ్‌బాస్ మ్యాజిక్. పాపం నాలుగు వారాల పాటు హౌస్‌లో వున్న సోనియా ఆకుల పరిస్థితి అలాగే అయ్యింది. ఆమెను ఓ బూచిలా చిత్రీకరించి, చివరికి హౌస్ నుంచి బయటికి పంపించేశారు.
ఆమె ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తోంది హౌస్‌లోని ఇద్దరు మగవాళ్లను.. అంటూ ఆరోపణ సోనియాపై వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, తన మనస్తత్వం, వ్యక్తిత్వం అలాంటిది కాదనీ, కావాలనే అలాంటి సన్నివేశాలు ఎడిట్ చేసి తనను బద్నాం చేశారంటూ బయటికొచ్చిన సోనియా వ్యాఖ్యానిస్తోంది.
అదలా వుంటే, హౌస్‌లో పరిస్థితులు మరోలా వున్నాయ్. అచ్చం సోనియానే ఇమిటేట్ చేస్తూ.. అదే ఆటిట్యూడ్ ప్రదర్శిస్తోంది యష్మి. మొదటి రెండు వారాలు యష్మి గేమ్ చాలా హుందాగా సాగింది.
ఎప్పుడయితే సోనియా బయటికొచ్చేసిందో.. ఆ స్థానాన్ని తాను ఆక్రమించినట్లయ్యింది. అనవసరమైన గోడవలు, అపార్ధాలూ, ఏడుపులు.. ఇలా ఒక్కటేమిటి.. తన డిగ్నిటీ మొత్తం పాడు చేసుకుంటోంది యష్మి. మొదట్లో ఆమె గేమ్ చూసినవాళ్లంతా బిగ్‌బాస్ విజేతకు వుండాల్సిన అర్హతలు ఆమెలో వున్నాయని అభిప్రాయపడ్డారు. కానీ, ఇప్పుడు ఆమె గేమ్ చూస్తుంటే అసహ్యం పుట్టేలా చేసుకుంటోంది. ఈ బిగ్ ఛేంజ్ ఎందుకో యష్మిలో.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com