దంతాల పరిశుభ్రతకు ఈ టిప్స్ ఫాలో చేయండి.!
- October 05, 2024
అందంగా కనిపించాలంటే కేవలం ముఖం మాత్రమే శుభ్రంగా వుంటే చాలదు. మన నోటి మాట కూడా అందంగా శుభ్రంగా వుండాలి. అప్పుడే అందరూ మన చెంత చేరుతారు.
అలా కాకుండా, నోటి నుంచి దుర్వాసన వస్తే.. స్నేహితులెవ్వరూ దగ్గరకు చేరరు. మరి, నోటి దుర్వాసనకు అనేక కారణాలు. దాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి.?
ఉరుకుల పరుగుల జీవితంలో బ్రష్ చేయడానికి ఎవరు అంత ఎక్కువగా టైమ్ కేటాయిస్తున్నారు.? సో, దంతాలు పాచి పట్టి మాట్లాడితే నోటి నుంచి దుర్వాసన వెదజల్లుతూంటుంది. అది అవతలి వ్యక్తుల్ని చాలా ఇబ్బంది పెడుతుంటుంది.
కొందరు ఆ విషయం చెప్పలేక దూరం జరిగిపోతుంటారు. మరి, నోటి దుర్వాసనను పోగొట్టడం ఎలా.? అఫ్‌కోర్స్ మార్కెట్లో అనేక రకాల మౌత్ ఫ్రెష్‌నర్లు వున్నాయనుకోండి. కానీ, అవి దంతాల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయ్.
అందుకే ఇంటి చిట్కాల ద్వారా దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నోటి దుర్వాసననూ తొలగించుకోవచ్చు. పళ్లపై గారలా పట్టేసిన పాచిని కూడా తొలిగించుకోవచ్చు.
లవంగాలు దంతాల ఆరోగ్యానికి చాలా మంచివి. కొద్దిగా నీటిని మరిగించి అందులో కొన్ని లవంగాలు వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటితో నోటిని పుక్కిలిస్తే దుర్వాసన పోవడమే కాకుండా, దంతాలపై పాచి తొలగిపోయి మిలమిలా మెరుస్తాయ్.
అలాగే ఉప్పు నీటితో రోజూ దంతాలను పుక్కిలించినా దంతాలపై పేరుకుపోయిన పాచి తొలగిపోతుంది.
అలోవెరా వేసి మరిగించిన నీటిలో కాస్త నిమ్మరసం, గ్లిజరన్ కలిపి పుక్కిలించినా మంచి ఫలితం వుంటుంది. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ఆరోగ్యకరమైన దంతాలు మీ సొంతం.
అలాగే ఆవ నూనెతోనూ దంతాలను పరిరక్షించుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో కాస్త ఆవనూనె వేసి పుక్కిలించొచ్చు. లేదంటే కాటన్‌తో పళ్లు, చిగుళ్లు రుద్దితే పేరుకుపోయిన పాచి తొలిగిపోతుంది. చిగురు వాపులు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలుంటే అవి కూడా తొలగిపోతాయ్. వీటి కోసం పెద్దగా కష్టపడక్కర్లేదుగా. జస్ట్ ట్రై ఇట్ వన్స్.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!