మోసపోయిన ఏపీ మహిళ...కువైట్‌ పేరు చెప్పి మస్కట్‌ తీసుకుపోయాడు!

- October 06, 2024 , by Maagulf
మోసపోయిన ఏపీ మహిళ...కువైట్‌ పేరు చెప్పి మస్కట్‌ తీసుకుపోయాడు!

 మస్కట్‌: ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ మహిళ దారుణంగా మోసపోయింది. ఓ ఏజెంట్ చేతిలో మోసపోయిన యువతి….కువైట్‌ పేరు చెప్పి మస్కట్‌ తీసుకుపోయాడంటూ సెల్పీ వీడియో ద్వారా పేర్కొంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  ఎన్టీఆర్ జిల్లా లోని చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన  వివాహిత దేవి...ఓ ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లాలని అనుకుంది. అయితే.. ఆ ఏజెంట్..కువైట్‌ పేరు చెప్పి.. మస్కట్‌ తీసుకువెళ్లాడట. 

తనకు కువైట్‌ పేరు చెప్పి.... మస్కట్ తీసుకువచ్చాడని  అక్కడ రెండు నెలలు ఒక ఆఫీసులో ఉద్యోగం చేయాలని వేధించాడని బాధిత మహిళ వీడియో లో పేర్కొంది. ఆ  తర్వాత, ఒక బడా వ్యాపారి ఇంట్లో వెట్టిచాకిరి చేయాలని టార్చర్‌ చేశాడట. గత కొంతకాలంగా బడా వ్యాపారి ఇంట్లో వెట్టిచాకిరి చేస్తున్నానని...అక్కడ పని భారం ఎక్కువయ్యి తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని తెలిపింది బాధితురాలు. ప్రస్తుతం తాను తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది.  ఏజెంట్ కు చెబితే... నేను చేసేది ఏమీ లేదని చేతులెత్తేసాడని పేర్కొంది. తిరిగి ఇండియాకు రావాలంటే నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని బాధిత మహిళ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా వివరించింది. చంద్రబాబు సర్కార్‌ సాయం చేయాలని కోరింది.

--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com