చెన్నై ఎయిర్ షో లో విషాదం

- October 07, 2024 , by Maagulf
చెన్నై ఎయిర్ షో లో విషాదం

చెన్నై: తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్‌ లో విషాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళం ఆధ్వ ర్యంలో ఆదివారం ప్రారంభించిన ‘మెగా ఎయిర్‌ షో ను వీక్షించేందుకు లక్షలాది సందర్శకులు పోటెత్తారు..

తిరుగు ప్రయాణంలో ఎక్కడికక్కడ రద్దీ ఏర్పడటంతో వారంతా తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఈ క్రమంలోనే జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందగా, అనేక మంది గాయపడినట్లు సమాచారం.

తీవ్ర రద్దీ, ఉక్కపోతతో దాదాపు 230 మంది సొమ్మసిల్లి పడిపోయారు. ఎయిర్‌ షోకు దాదాపు 10 లక్షలమంది హాజరైనట్లు అంచనా.మధ్యాహ్నం ఒంటిగంటకే ప్రదర్శన ముగిసినప్పటికీ.. సాయంత్రం వరకు ట్రాఫిక్‌ కొనసాగింది.

క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలించేందుకూ ఇబ్బంది ఎదురైంది. చెన్నైనుంచే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలిరావడంతో.. మెరీనా బీచ్‌ సమీపంలోని లైట్‌హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్‌టీఎస్‌ రైల్వేస్టేషన్‌లు కిక్కిరిసిపోయాయి.

షో ముగిసిన అనంతరం తిరుగుప్రయాణం కోసం వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్‌లకు చేరుకోవడంతో.. ప్లాట్‌ఫాంలపై నిలబడేందుకూ వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అన్నా స్క్వేర్‌లోని బస్‌స్టాప్‌కు సందర్శకులు పోటెత్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com