ఏపీ: మద్యం షాపుల దరఖాస్తులు..
- October 07, 2024
అమరావతి: మద్యం షాపుల లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజులు చెల్లింపుపై నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షాపుల లైసెన్స్ కోసం మాన్యువల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలనుకునే వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు దరఖాస్తు రుసుమును దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వాణిజ్య బ్యాంకు నుంచైనా డీడీ తీసుకునే వెసులుబాటు ఇచ్చారు.
ఏపీలోని వాణిజ్య బ్యాంకులు స్పాన్సర్ చేసే ఏదైనా గ్రామీణ బ్యాంకు నుంచి కూడా డీడీ తీసుకోవచ్చు. సీఎఫ్ఎంఎస్లోని సిటిజన్ ఛలానాను సంబంధిత ఖాతాల ద్వారా కూడా తీసుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
ప్రభుత్వం మద్యం షాపులను మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ, నగర పంచాయితీ, మండలాల వారీగా ఇప్పటికే విభజించింది. ఆ మేరకు సిస్టమ్ సీరియల్ నంబర్‌ను జనరేట్ చేస్తుంది. మాన్యువల్ విధానంలో దరఖాస్తు చేసే వారు సంబంధిత దరఖాస్తులో ఛలానా/డీడీ నంబర్‌ను సిస్టమ్‌లో పేర్కొనాలి. వీటిని సంబంధిత ఎక్సైజు శాఖ కార్యాలయంలోని కేంద్రాల్లో దరఖాస్తుతో పాటు ఒరిజినల్ ఛలానా/ డీడీలను అందజేయాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!