ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన ..
- October 08, 2024
న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తన షెడ్యూల్లో భాగంగా నేడు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఉదయం 11:30 గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమవుతారు. అనంతరం 5:45 గంటలకు కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నారు.
ఇక రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రి 11:15 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో చంద్రబాబు సమావేశమవుతారు. వరద సాయం, రాజధాని అమరావతి అవుటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం,రాష్ట్రంలో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు, బడ్జెట్లో ప్రకటించిన పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి గురించి ఈ సందర్భంగా కేంద్రమంత్రులతో చర్చించి నిధుల విడుదల గురించి ప్రస్తావించనున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి