ఖతార్ లో 13.7 శాతం పెరిగిన వాహన అమ్మకాలు..!!

- October 08, 2024 , by Maagulf
ఖతార్ లో 13.7 శాతం పెరిగిన వాహన అమ్మకాలు..!!

దోహా: ఖతార్  కొత్త వాహనాల అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా ఆటోమొబైల్స్ అమ్మకాలలో ఖతార్ భారీ వృద్ధిని నమోదు చేస్తోంది.  ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో 53,558 కొత్త వాహనాలు అమ్ముడుపోయాయి. 2023లో ఇదే కాలంలో నమోదైన 47,111 వాహనాలతో పోలిస్తే ఇది 13.7 శాతం పెరిగిందని జాతీయ ప్రణాళికా మండలి విడుదల చేసిన డేటా వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన అన్ని కొత్త వాహనాల్లో 70 శాతానికి పైగా ప్రైవేట్ వాహనాలే కావడం గమనార్హం. మే నెలలో అత్యధికంగా 8,903 కొత్త వాహనాలు సేల్ కాగా, జనవరిలో 8,512, మార్చిలో 7,835, జూలైలో 7,733, ఫిబ్రవరిలో 7,231, ఏప్రిల్‌లో 7,011, జూన్‌లో 6,333 కొత్త వాహనాల అమ్మకాలు నమోదయ్యాయి.

నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ ప్రకారం.. ఆగస్టు 2024 చివరి నాటికి ఖతార్ మొత్తం జనాభా 3.054 మిలియన్లకు చేరుకుంది. గత 16 సంవత్సరాల్లో జనాభా రెట్టింపు అయింది. ఈ సంవత్సరం ఖతార్ GDP వృద్ధి అంచనా 2.2 శాతంగా ఉంది. 2030 నాటికి నాన్-హైడ్రోకార్బన్ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో నాలుగు శాతం వార్షిక వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 మొదటి మూడు త్రైమాసికాల్లో ఖతార్ ను సుమారు 3.6 మిలియన్ల సందర్శకులు సందర్శించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com