Dh71.5-బిలియన్ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం.. యూఏఈ చరిత్రలో అతిపెద్దది..!!
- October 08, 2024
యూఏఈ: 2025 ఫెడరల్ బడ్జెట్ Dh71.5 బిలియన్లకు యూఏఈ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది దేశ చరిత్రలో అతిపెద్దదిగా భావిస్తున్నారు.యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు బడ్జెట్ ను ఆమోదించారు.
2024లో ఫెడరల్ బడ్జెట్ Dh64.06 బిలియన్లు, ఇది మునుపటి సంవత్సరం బడ్జెట్ (Dh63.066 బిలియన్) కంటే 1.6 శాతం ఎక్కువ. 2022, 2023 నుండి 2026 సంవత్సరాలకు యూఏఈ మొత్తం ఫెడరల్ బడ్జెట్ Dh252.3 బిలియన్లుగా ఉంది. 2025 బడ్జెట్లో ఎక్కువ భాగం సామాజిక అభివృద్ధి, పెన్షన్లు (39 శాతం), ప్రభుత్వ వ్యవహారాలకు (35.7 శాతం) 25.57 బిలియన్ దిర్హామ్‌లను కేటాయించారు.
Dh27.859 బిలియన్ల సామాజిక అభివృద్ధి నిధి కింద, పబ్లిక్ - ఉన్నత విద్యా కార్యక్రమాల కోసం Dh10.914 బిలియన్లు కేటాయించారు. ఆరోగ్య సంరక్షణ - కమ్యూనిటీ నివారణ సేవల కోసం Dh5.745 బిలియన్లు, మాజిక వ్యవహారాల కోసం Dh3.744 బిలియన్లు, పెన్షన్ల కోసం Dh5.709 బిలియన్లు, ప్రజా సేవల కోసం Dh1.746 బిలియన్లు, ఆర్థిక పెట్టుబడులపై కొన్ని Dh2.864 బిలియన్లు (4 శాతం), మౌలిక సదుపాయాలు - ఆర్థిక రంగంపై Dh2.581 బిలియన్లు (3.6 శాతం) ఖర్చు చేయనున్నారు. ఇతర ఫెడరల్ ఖర్చులు Dh12.624 బిలియన్లు, బడ్జెట్లో 17.7 శాతం కేటాయించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి