ఎన్టీయార్-ప్రశాంత్ నీల్ మూవీకి ఆ సెంటిమెంట్ అప్లై చేయనున్నారా.?

- October 09, 2024 , by Maagulf
ఎన్టీయార్-ప్రశాంత్ నీల్ మూవీకి ఆ సెంటిమెంట్ అప్లై చేయనున్నారా.?

‘దేవర’ సినిమాతో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీయార్.ఎలాగోలా దసరా సెలవుల్ని క్యాష్ చేసుకుంటూ నడిచిపోతోంది ‘దేవర’ సినిమా. హిట్ అనీ చెప్పలేం.అలా అని డిజాస్టర్ అని కూడా అనలేం.
ఏదో అలా అలా సెలవుల ఫ్లోలో కొట్టుకెళ్లిపోతోంది. ఆ సంగతి అటుంచితే, ఎన్టీయార్ నెక్స్‌ట్ ప్రశాంత్ నీల్ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడట.
‘దేవర’ రిజల్ట్‌తో ప్రశాంత్ నీల్ సినిమాని చాలా సీరియస్‌గా తీసుకున్నాడట ఎన్టీయార్. ఈ సినిమాతో ఎలాగైనా సంచలన విజయం అందుకోవాలనుకుంటున్నాడు.
ప్రశాంత్ నీల్ మీద ఆ నమ్మకం కూడా వుంది. ఇక, ఈ సినిమాకి హిట్ కలర్స్ అద్దబోతున్నారట. అందులో భాగంగానే హీరోయిన్ల ఎంపిక జరుగబోతోందనీ తెలుస్తోంది.
ప్రస్తుతం నేషనల్ క్రష్ అండ్ లక్కీ లెగ్ రష్మికా మండన్నాని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. అలాగే, ప్రశాంత్ నీల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కి ఓ స్పెషాలిటీ వున్న సంగతి తెలిసిందే.
గతంలో ‘కేజీఎఫ్’ కోసం తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయించాడు ప్రశాంత్ నీల్. అలాగే, ఈ సారి ఎన్టీయార్ సినిమా కోసం సమంతని తీసుకోవాలనుకుంటున్నాడనీ తెలుస్తోంది.
సమంత ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేసిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటూ, సమంత చేసిన ‘ఊ అంటారా.. ’ స్పెషల్ సాంగ్ ఏ స్థాయిలో సెన్సేషనల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో, ప్రశాంత్ నీల్ - ఎన్టీయార్ సినిమాకి ఈ సెంటిమెంట్ ఫాలో చేయాలనుకుంటున్నారట. చూడాలి మరి, ఇది కేవలం ప్రచారమేనా.? నిజంగానే సమంత సాంగ్ వుండబోతోందా అనేది.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com