రతన్ టాటా మృతి పై ప్రముఖుల సంతాపం

- October 10, 2024 , by Maagulf
రతన్ టాటా మృతి పై ప్రముఖుల సంతాపం

ముంబై: అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా కన్నుమూశారు.రతన్ టాటా మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాపారవేత్తలు హర్ష గోయెంకా, ఆనంద్ మహీంద్రా, గౌతమ్ ఆదానీ ట్వీట్లు చేశారు. టాటా ఇకపై లేరన్న విషయాన్ని తాను స్వీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దేశం దిశను పునర్నిర్వచించిన గొప్ప వ్యక్తిని భారత్ కోల్పోయిందని అదానీ ట్వీట్ చేశారు. వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన టాటా ఇక లేరని హర్ష గోయెంకా పేర్కొన్నారు.

చిత్తశుద్ధి, నిజాయితీతో ప్రపంచంపై ముద్ర వేసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పరిశ్రమల అభివృద్ధి, సమాజ సేవలో ఆయన భాగస్వామ్యం తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. టాటా మరణంతో ఇండస్ట్రీ ఐకాన్ను కోల్పోయిందని, ఆయనలాగా ఇంకెవ్వరూ ఉండరని టీజీ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.

వాణిజ్య రంగానికి రతన్ టాటా ఆదర్శమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాసుకొచ్చారు. కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, పియూష్ గోయల్ సంతాపం తెలియజేశారు. ఇండియా ఇండస్ట్రీకి రతన్ టాటా టైటాన్ అని రాజ్నాథ్ ట్వీట్ చేశారు. టాటా నిజమైన దేశభక్తుడని అమిత్ షా పేర్కొన్నారు. పరిశ్రమలకు రతన్ చేసిన కృషి మన దేశంతో పాటు ప్రపంచంపై చెరగని ముద్ర వేసిందని నడ్డా తెలిపారు. రతన్ కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com