అంతర్జాతీయ 'మోస్ట్ వాంటెడ్' సీన్ మెక్‌గవర్న్ అరెస్టు..!!
- October 13, 2024
దుబాయ్: ఐర్లాండ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ పరారీలో ఉన్న అంతర్జాతీయ మాన్‌హాంట్ సీన్ మెక్‌గవర్న్ ను యూఏఈలో అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఇంటర్‌పోల్ అధికారిక వెబ్‌సైట్ వెల్లడించింది. కినాహన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్‌లో అతడుకీలక సభ్యుడు. అతడిని అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. అక్టోబర్ 10న దుబాయ్ పోలీసులు అతన్ని పట్టుకున్నట్లు నివేదికలో వెల్లడించారు. ఇంటర్‌పోల్ సెక్రటరీ జనరల్ జుర్గెన్ స్టాక్ మాట్లాడుతూ.. ఐరిష్ అధికారులు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంయుక్త ప్రయత్నాలతో ఐర్లాండ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల్లో ఒకరిని అరెస్టు చేసారని తెలిపారు. అనేక నేరాలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్న మెక్‌గవర్న్‌ను అప్పగించే ప్రక్రియ ప్రారంభమైందని ఇంటర్‌పోల్ వెబ్‌సైట్ తెలిపింది. అయితే, అతని అరెస్టుపై స్థానిక అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!







