బహ్రెయిన్ లో ‘వీట్ బ్రాన్’ బ్లాక్ మార్కెట్.. డబుల్ ధరలకు విక్రయం..!!

- October 13, 2024 , by Maagulf
బహ్రెయిన్ లో ‘వీట్ బ్రాన్’ బ్లాక్ మార్కెట్.. డబుల్ ధరలకు విక్రయం..!!

మనామా: బహ్రెయిన్ ఫ్లోర్ మిల్స్ కంపెనీ (BFMC) పశువుల పెంపకందారులకు కేటాయించిన స్థానికంగా "శ్వర్" అని పిలువబడే సబ్సిడీ గోధుమ ఊక(వీట్ బ్రాన్) అర్హులైన లబ్ధిదారులకు  చేరడం లేదని అధికారులు తెలిపారు. కొంతమంది వ్యాపారాల నెట్‌వర్క్ లాభాపేక్ష కోసం ప్రభుత్వ మద్దతు వ్యవస్థను పక్కదారి పట్టిస్తోందని, అధికారిక ధరల కంటే రెట్టింపు ధరలకు చట్టవిరుద్ధంగా రీసేల్ చేస్తున్నారని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్ విక్రేతలు ఒక్కో బ్యాగ్‌కు 6 బిడి వరకు వసూలు చేస్తున్నారని, ఇది అధికారిక రేటు కంటే రెట్టింపు ధర అని BFMC విడుదలచేసిన నివేదికలో వెల్లడించింది. దీనిపై BFMC అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు లబ్ధిదారులు కోరుతున్నారు. చాలా మంది రైతులు తమ వాటాను BFMC నుండి కాకుండా దళారుల నుంచి తీసుకుంటున్నారని, మోసం జరిగేందుకు ఇది ఒక కారణమని అధికారులు తెలిపారు.  దళారులు రైతుల తరపున వీట్  బ్రాన్ కొనుగోలు చేసి తమ ఇంటి వద్దకే అందజేస్తున్నారని రైతులు తెలిపారు. రైతు కోరినన్ని బస్తాలు ఇస్తున్నారని ఇది రైతులను వారి ఉచ్చులో పడేందుకు ఒక కారణమని తెలిపారు.  కొంతకాలంగా ఈ చట్టవిరుద్ధమైన కొనుగోళ్లు పెరిగాయని, దాంతో చిన్న-స్థాయి రైతులకు ప్రభత్వం అందజేసే ప్రయోజనం దూరంఅవుతుందని రైతులు ధృవీకరించారు.  బ్లాక్ మార్కెట్ బహ్రెయిన్ పశువుల పెంపకం రంగానికి హాని కలిగిస్తోందని, అనవసరమైన ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని BFMC అధికారులను కోరుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com