హవల్లిలో ఆకస్మిక తనిఖీలు..5 మంది అరెస్ట్, 3 వాహనాలు సీజ్

- October 14, 2024 , by Maagulf
హవల్లిలో ఆకస్మిక తనిఖీలు..5 మంది అరెస్ట్, 3 వాహనాలు సీజ్

కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ హవల్లిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ప్రకటించింది. అదుపులోకి తీసుకున్న వారిలో మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ఇద్దరు అనుమానితులు, ఇద్దరు వాంటెడ్ వ్యక్తులు, రెసిడెన్సీ చట్టాలు ఉల్లంఘించినవారు ఉన్నారని తెలిపారు. ఈ ఆపరేషన్లో మూడు వాహనాలను సీజ్ చేసినట్టు వెల్లడించారు.  దేశవ్యాప్తంగా భద్రత, పబ్లిక్ ఆర్డర్ను నిర్వహించడానికి కొనసాగుతున్న వ్యూహంలో ఈ తనిఖీలు భాగమని మంత్రిత్వ శాఖ తెలిపింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com