గ్రీస్‌లో సౌదీ నేవీ.. జాయింట్ నేవల్-ఎయిర్ ఎక్సర్సైజ్..!!
- October 14, 2024
రియాద్: సౌదీ నేవీ దళాలు గ్రీస్‌లో "మెడుసా 13" పేరుతో నిర్వహిస్తున్న జాయింట్ నేవల్-ఎయిర్ ఎక్సర్సైజ్లో పాల్గొంటున్నాయి. ఇందులో ఆతిథ్య గ్రీస్ తో పాటు ఈజిప్ట్, ఫ్రాన్స్ , సైప్రస్ పాల్గొంటున్నాయి. సౌదీ నావికాదళ కమాండర్ కమాండర్ కల్నల్ ఫహద్ అల్-ఒతైబీ మాట్లాడుతూ.. నావికాదళ భద్రతను పెంపొందించడానికి ఉమ్మడి భద్రతా సహకారాన్ని నిర్మించడం ఈ ఎక్సర్సైజ్ లక్ష్యం అని తెలిపారు. సౌతీ నేవీలో ప్రత్యేక నౌకాదళ భద్రతా విభాగాలు, మెరైన్ ఇన్ఫాంట్రీ, హిజ్ మెజెస్టి షిప్‌లు, నేవల్ ఏవియేషన్‌కు చెందిన వివిధ విభాగాలు పాల్గొంటున్నాయి. గ్రీకు ద్వీపం క్రీట్-మధ్యధరా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇందులో సైనిక కార్యకలాపాలు, సమాచార కార్యకలాపాలు, ఉభయచర దాడి, పౌరుల తరలింపు వంటివి ఉంటాయని సౌదీ తెలిపింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి