పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి : మంత్రి కొల్లు రవీంద్ర

- October 14, 2024 , by Maagulf
పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి : మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి: నూతన ఎక్సైజ్ పాలసీ 2024ని అత్యంత పారదర్శకంగా అమలు చేసిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కానూరులోని ఏపీఎండీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా పూర్తి పారదర్శకంగా పాలసీని అమలు చేసి చూపించాం అన్నారు. అత్యంత పకడ్బందీగా షాపుల కేటాయింపు జరిగిందన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో చేసిన దుర్మార్గాలకు, స్కాములకు నేటితో తెరదించాం అన్నారు. 3396 షాపులకు అక్టోబర్ 1 నుండి దరఖాస్తులు ఆహ్వానించగా 89,882 మంది దరఖాస్తు చేసుకున్నారన్ని.. ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించాం అన్ని తెలిపారు. దీంతో ప్రభుత్వానికి రూ.1797 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం లేకుండా షాపుల్ని కేటాయించాం అన్నారు. 

పారదర్శకంగా షాపుల కేటాయింపు గతంలో ఒక్కో షాపునకు సగటున 18 దరఖాస్తులు వస్తే.. ఇప్పుడు ఏకంగా 26.7 దరఖాస్తులు వచ్చాయి . ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కో షాపునకు వందకు పైగా దరఖాస్తులు కూడా వచ్చాయి. 2015-17లో 4380 షాపులకు 65,208 దరఖాస్తులు రాగా రూ.225 కోట్ల ఆదాయం వచ్చింది. 2017-19లో 4377 షాపులకు 76,329 దరఖాస్తులు రాగా రూ.422 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. కానీ ఇప్పుడు ఏకంగా 89,882 దరఖాస్తులు, రూ.1797 కోట్ల ఆదాయం రావడం సంతోషకరం. ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఈ దరఖాస్తులు నిదర్శనం. డ్రా నిర్వహణ కూడా ప్రశాంతంగా జరగడమే కాకుండా పారదర్శకంగా నిర్వహించాం. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఇంత విజయవంతం చేసినందుకు కమిషనర్, సెక్రటరీ, ఎక్సైజ్ సిబ్బంది, సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com