భయం కాదు.. ఆశను ఎంచుకోండి..!!

- October 15, 2024 , by Maagulf
భయం కాదు.. ఆశను ఎంచుకోండి..!!

మనామా: ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటున్నారు. మిడిల్ ఈస్ట్ హాస్పిటల్.. బహ్రెయిన్ ఫ్రీ లేబర్ యూనియన్స్ ఫెడరేషన్ (అల్ హుర్), ఫ్రీ లేబర్ యూనియన్ ఆఫ్ బహ్రెయిన్ ఎయిర్‌పోర్ట్ కంపెనీ, నేషనల్ లేబర్ యూనియన్ గల్ఫ్ ఎయిర్‌లతో కలిసి గల్ఫ్ ఎయిర్ ప్రాంగణంలో బ్రెస్ట్ అవగాహన ప్రచారాన్ని నిర్వహించింది. రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, నివారణ చర్యలు, అందుబాటులో ఉన్న చికిత్సలపై హాజరైన వారికి అవగాహన కల్పించారు.  ప్రఖ్యాత కన్సల్టెంట్ జనరల్ & బేరియాట్రిక్ సర్జరీ, మిడిల్ ఈస్ట్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ అమెర్ అల్ డెరాజీ కీనోట్ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత మెటర్నిటి స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, కాస్మెటిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ షైస్టా సరివాల్ క్యాన్సర్ ను ప్రారంభంలో గుర్తించే పద్ధతుల గురించి ప్రదర్శన ఇచ్చారు.   రొమ్ము క్యాన్సర్ నివారణతోపాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలను నిర్వహించుకోవాలని సూచించారు.  ఈ సందర్భంగా క్యాన్సర్ బారి నుంచికోలుకున్న పేషంట్లు తమ అనుభవాలను పంచుకున్నారు. చివరగా రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి ప్రచారంలో ఉన్న అపోహలు, స్క్రీనింగ్, రోగనిర్ధారణ, చికిత్స ఎంపికల గురించి ప్రశ్నలకు డాక్టర్లు సమాధానాలు ఇచ్చారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com