కనిపించని యూట్యూబ్ ‘స్కిప్ యాడ్’ బటన్

- October 15, 2024 , by Maagulf
కనిపించని యూట్యూబ్ ‘స్కిప్ యాడ్’ బటన్

యూట్యూబ్ లో adds అనేవి యూట్యూబ్ వినియోగదారులకు ఉచితంగా కంటెంట్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ adds ద్వారా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు ఆదాయం అందిస్తుంది, తద్వారా వారు మరింత నాణ్యమైన వీడియోలను తయారు చేయగలుగుతారు. యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయం యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్వహించడానికి, సాంకేతికతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా, యాడ్స్ యూట్యూబ్ వినియోగదారులకు, కంటెంట్ క్రియేటర్లకు, యూట్యూబ్ సంస్థకు లాభదాయకంగా ఉంటాయి. వీడియో ప్రయారిటీనీ బట్టి వీక్షకులు adds నీ స్కిప్ చేసుకొని తమకు ఇష్టమైన విడియోని చూసుకునే అవకాశం ఉండేది. అయితే ఇటీవల కాలంలో స్కిప్ add బటన్ కనిపించడం లేదు. దీనికి కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకుందాం.

ఇటీవల, యూట్యూబ్ వినియోగదారులు ‘స్కిప్ యాడ్’ బటన్ కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే ప్రకటనలను స్కిప్ చేయడానికి ఉపయోగించే ఈ బటన్ కొందరికి కనిపించడం లేదు. ఈ సమస్యను కొందరు డెస్క్‌టాప్ వినియోగదారులు, మరికొందరు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్నారు.

అయితే యూట్యూబ్ ప్రతినిధులు ఈ ఫిర్యాదులను ఖండించారు. స్కిప్పబుల్ యాడ్స్ ఇప్పటికీ ‘స్కిప్ యాడ్’ బటన్ కలిగి ఉన్నాయని, ఈ బటన్‌ను తీసివేయలేదని స్పష్టం చేశారు. కాగా యూట్యూబ్ వీడియో ప్లేయర్‌ను మరింత మెరుగ్గా, సౌకర్యవంతంగా చేయడానికి కొన్ని మార్పులు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే యాడ్స్ స్కిప్ చేసే సమయంలో కౌంట్‌డౌన్ టైమర్‌కు బదులుగా ప్రోగ్రెస్ బార్‌ను చూపించనున్నారని చెప్పారు.

ఈ మార్పులు యూట్యూబ్ వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని, ‘స్కిప్ యాడ్’ బటన్ అందుబాటులో ఉంటుందని, దాని డిజైన్, లుక్ మాత్రమే మారుతాయని యూట్యూబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ విధంగా, యూట్యూబ్ వినియోగదారులు తమకు ఇష్టమైన వీడియోలను చూడటంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి యూట్యూబ్ ప్రయత్నిస్తోంది.

--వేణు పెరుమాళ్ల (మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com