ఢిల్లీకి చేరిన తెలంగాణ ఐఏఎస్‌ల లొల్లి, నేడు క్యాట్ లో విచారణ

- October 15, 2024 , by Maagulf
ఢిల్లీకి చేరిన తెలంగాణ ఐఏఎస్‌ల లొల్లి, నేడు క్యాట్ లో విచారణ

ఢిల్లీ: మొత్తానికి తెలంగాణ, ఏపీ ఐఏఎస్‌ల లొల్లి ఢిల్లీ చేరుకుంది. ఈ ఐఏఎస్ అధికారులు అయిన వాకాటి కరుణ, రోనాల్డ్ రాజ్, ఆమ్రపాలి, వాణి ప్రసాద్, సృజన గుమ్మల వీరిని తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని వీరు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) క్యాట్ ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నేడు క్యాట్ లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల పిటిషన్లపై విచారణ జరుపుతోంది. 

ఈ పిటిషన్లపై విచారణ జరుగుతుండగా, కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ వివరణలో, కేంద్రం తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను వివరించాల్సి ఉంటుంది.ఈ విచారణ ఫలితంగా, ఐఏఎస్ అధికారుల భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఈ పిటిషన్లపై క్యాట్ తీసుకునే నిర్ణయం, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాలు, ఐఏఎస్ అధికారుల పనితీరు మరియు వారి భవిష్యత్తు నియామకాలపై ప్రభావం చూపవచ్చు. ఈ విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

--వేణు పెరుమాళ్ల (మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com