యూఏఈలో 'పామ్ ఐడి'.. త్వరలో కార్డులు, యాప్‌లకు బైబై..!!

- October 15, 2024 , by Maagulf
యూఏఈలో \'పామ్ ఐడి\'.. త్వరలో కార్డులు, యాప్‌లకు బైబై..!!

యూఏఈ: యూఏఈలో చెల్లింపులు,నగదు ఉపసంహరణ కోసం 'పామ్ ఐడి'లు రానున్నాయి. దీంతో క్రెడిట్ కార్డులు, డిజిటల్ అప్లికేషన్‌ల వంటి ప్రస్తుత చెల్లింపు మోడ్‌లు చరిత్రలో కలిసిపోనున్నాయి.  ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని సంస్థలకు అనుసంధానించబడిన 'పామ్ ఐడి'తోవేగవంతమైన సేవలను పొందవచ్చు. ఈ 'పామ్ ఐడి' సాంకేతికతను యూఏఈ సెంట్రల్ బ్యాంక్ సహకారంతో.. గుర్తింపు, పౌరసత్వం, కస్టమ్స్, పోర్ట్ భద్రత కోసం ఫెడరల్ అథారిటీ(ICP) అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలను Gitex Global 2024లో ICP స్టాండ్‌లో ప్రదర్శిస్తున్నారు. పౌరులు, నివాసితులు తమ ఎమిరేట్స్ ID కార్డ్ లేదా ఇతర ఎంపికలను ఉపయోగించి ICPతో తమ అరచేతి బయోమెట్రిక్‌లను నమోదు చేసుకోవచ్చు.  మిడిల్ ఈస్ట్‌లో ఈ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన తొలి దేశంగా యూఏఈ అవతరించనుందని అధికార వర్గాలు చెబుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com