సౌదీ అరేబియాలో డెలివరీ బైక్‌లకు కొత్త లైసెన్స్‌ల జారీ నిలిపివేత..!!
- October 15, 2024
రియాద్: మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఆర్డర్లను డెలివరీ చేయడానికి మోటార్‌సైకిళ్లకు కొత్త లైసెన్స్‌లను మంజూరు చేయడాన్ని నిషేధించారు. కొత్త నిబంధనలు జారీ చేసే వరకు నిషేధం అమల్లో ఉంటుందని సౌదీ ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) అధికార ప్రతినిధి సలేహ్ అల్-జువేద్ ప్రకటించారు. డెలివరీ అప్లికేషన్ల ద్వారా మోటార్‌సైకిళ్లపై డెలివరీ సేవలను అందించడంలో ఉన్న కంపెనీలు, ప్రయోగాత్మక నియంత్రణ దశలో ముందుగా లైసెన్స్ పొందాయని, ఈ దశ ఇప్పుడు ముగిసిందని అల్-జువేద్ తెలిపారు.
రియాద్ వీధుల్లో అనేక మంది డెలివరీ బైక్ డ్రైవర్లకు వర్క్ పర్మిట్లు లేవని లేదా ట్రాఫిక్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అందుకే వారిని అరెస్టు చేయడం గమనార్హం. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తరువాత సౌదీ అరేబియా ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డెలివరీ సేవలు భారీగా పెరిగాయి. 2023 మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఈ సంవత్సరం 38 శాతం పెరిగింది. సౌదీ అరేబియాలో లైట్ ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీ వృద్ధికి తమ సేవలను అందించే మోటార్‌సైకిళ్ల సంఖ్య పెరగడంతో పాటు మొదటి త్రైమాసికంలో లైట్ ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీ వృద్ధి చెందిందని అల్-జువేద్ వెల్లడించారు. లైట్ ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీకి సంబంధించిన అధికారిక లైసెన్స్‌ల సంఖ్య 300గా ఉందని ప్రకటించారు. గత ఏడాది ఇదే త్రైమాసికానికి 2900గా ఉన్న వాణిజ్య రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ఈ ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ప్రస్తుత వాణిజ్య రిజిస్ట్రేషన్ల సంఖ్య 61 శాతం వృద్ధిని నమోదు చేసి 4700 వాణిజ్య రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







