‘మట్కా’.! రెట్రో లుక్స్‌తో కిర్రాకెత్తిస్తున్న మెగా రాకుమారుడు.!

- October 15, 2024 , by Maagulf
‘మట్కా’.! రెట్రో లుక్స్‌తో కిర్రాకెత్తిస్తున్న మెగా రాకుమారుడు.!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో ‘మట్కా’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కరుణ్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు.
నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా నుంచి లేటెస్ట్‌గా ఓ సాంగ్ రిలీజ్ చేశారు.
నోరా ఫతేహి నర్తించిన ఈ స్పెషల్ సాంగ్‌లో ‘లే రాజా.. ’ అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయ్. ఇక, పాటలో వరుణ్ తేజ్ రెట్రో లుక్స్ కిర్రాకెత్తిస్తున్నాయ్. 20వ సెంచరీ నాటి గ్యాంబ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ మధ్య వరుణ్ తేజ్‌కి కలిసొచ్చిన సినిమాలేం లేవు. కానీ, ‘మట్కా’ సినిమాపై అంచనాలున్నాయ్. ‘గద్దల కొండ గణేష్’ తరహాలో ఈ సినిమా వరుణ్ తేజ్‌కి మంచి హిట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా వుంది. ఆ నేపథ్యంలోనే లేటెస్ట్ స్పెషల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఆల్రెడీ గతంలో ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్లకు పాజిటివ్ రెస్సాన్స్ వున్న సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com