వృద్ధుల కోసం ఇంటిగ్రేటెడ్ కేర్ సేవలు ప్రారంభం.. PHCC
- October 16, 2024
దోహా: లీబైబ్ హెల్త్ సెంటర్‌లో వృద్ధులకు ఇంటిగ్రేటెడ్ కేర్ (ICOPE) సేవలను ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) ప్రారంభించింది. ఇది అల్ వాజ్‌బా, రౌదత్ అల్ ఖైల్ హెల్త్ సెంటర్‌లలో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో ఈ సేవలను మరిన్ని సెంటర్లకు విస్తరించనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అభివృద్ధి చేసిన ప్రాజెక్టులో భాగంగా వృద్ధుల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులు వీలైనంత కాలం స్వతంత్రంగా జీవించేలా చేస్తుంది. మిడిల్ ఈస్ట్‌లో ICOPE మొదటి పైలట్ ప్రాజెక్టును ఖతార్ లో ప్రారంభించారు. హమద్ మెడికల్ కార్పొరేషన్‌తో కలిసి పనిచేస్తున్నట్లు PHCC వెల్లడించింది. దృష్టి, వినికిడి లోపం, పోషకాహార లోపం వంటి స్క్రీనింగ్ సేవలు లీబైబ్ హెల్త్ సెంటర్‌లో వృద్ధులకు అందుబాటులో ఉంటాయి. క్లినిక్ ప్రతి సోమవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పని చేస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







