జమ్మూకశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లా
- October 16, 2024
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయించారు. ఒమర్ అబ్దుల్లాతోపాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా సురేంద్ర చౌదరి ప్రమాణ స్వీకారం చేయగా.. జావేద్ దార్, సకినా ఇట్టు, జావేద్ రానా, సతీష్ శర్మలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భారత కూటమి నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సుప్రియా సూలె, అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారానికి ముందు మీడియాతో మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా .. కొత్తగా ఏర్పాటవుతున్న తమ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. జమ్ము కశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశాక.. ప్రమాణ స్వీకారం చేస్తున్న తొలి ముఖ్యమంత్రిని తానేనన్నారు. గడిచిన పదేళ్లలో జమ్ము కశ్మీర్ ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొన్నారని, తమ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు.
కాగా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 29, కాంగ్రెస్ కు 6, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 3, పీపుల్ కాన్ఫరెన్స్ కు 1, సీపీఐ(ఎం) 1 స్థానాల్లో గెలిచాయి. కాగా.. జమ్ము కశ్మీర్ ను కేంద్రంలో ఉన్న బీజేపీ 2019, ఆగస్టు 5న కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. జమ్ము కశ్మీర్, లడఖ్ గా విభజించి రాష్ట్రపతి పాలన విధించింది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల జరిగిన జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో విజయం సాధించగా.. నలుగురు స్వతంత్రులు, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి