రియాద్‌లో భారీ డ్రగ్ నెట్‌వర్క్..16 మంది అధికారులు సహా 21 మంది అరెస్టు..!!

- October 17, 2024 , by Maagulf
రియాద్‌లో భారీ డ్రగ్ నెట్‌వర్క్..16 మంది అధికారులు సహా 21 మంది అరెస్టు..!!

రియాద్: సౌదీ భద్రతా అధికారులు రియాద్ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ప్రధాన నెట్‌వర్క్‌ను ఛేదించారు. మొత్తం 21 మంది అనుమానితులను అరెస్టు చేశారు.  వారిలో వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 16 మంది అధికారులు ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్, ఇతర ఏజెన్సీలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడంలో.. అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసే ముందు అవసరమైన చట్టపరమైన విధానాలను తీసుకోవడంలో విజయవంతమయ్యాయి. అరెస్టయిన వారిలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నేషనల్ గార్డ్ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు ఉన్నారని వెల్లడించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com