మునగాకుతో మెరిసిపోయే యవ్వన సౌందర్యం మీ సొంతం.!
- October 17, 2024
మునక్కాయల్ని ఇష్టపడి తింటుంటారు. కానీ, మునగాకును పెద్దగా పట్టించుకోరు. కానీ, మునగాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని తెలిస్తే మాత్రం వదిలి పెట్టరు. వంటకాల్లో అనేక రకాలుగా మునగాకుల్ని వాడుకోవచ్చు.
పప్పులో వేసుకోవచ్చు. చారు, రసం, సాంబారు వంటి వాటిలో మునగాకుల్ని విరివిగా వాడుకోవచ్చు. అలాగే, నాన్వెజ్ ఐటెమ్స్లోనూ మునగాకుల్ని మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు.
మునగాకులో విటమిన్ సి ఎక్కువగా వుంటుంది. జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటివి కూడా పుష్కలంగా వుంటాయ్.
మునగాకును రెగ్యులర్గా తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, కీళ్ల నొప్పులు, వాపులు వంటి సాధారణ వ్యాధులు సులభంగా నయమవుతాయ్.
అన్నింటికీ మించి మునగాకును తింటే వృద్ధాప్యం త్వరగా దరి చేరదని తాజా సర్వేలో తేలింది. అందుకు కారణం మునగాకులో వుండే యాంటీ ఏజింగ్ లక్షణాలే.
ముఖ్యంగా యవ్వనంలో పింపుల్స్తో బాధపడేవారు చాలా ఎక్కువ. పింపుల్స్ అందాన్ని చెడగొట్టడమే కాకుండా.. వయసు మళ్లినట్లుగా మార్చేస్తుంది.
అందుకే పింపుల్స్కి మునగాకు రసం చాలా చాలా మంచిది. రాత్రి పడుకునే ముందు వారానికి రెండు సార్లు మునగాకు రసం అప్లై చేస్తే ముఖంపై పింపుల్స్ పోయి, చర్మం కాంతివంతంగా మారుతుంది.
అంతేకాదు, యాజ్ బార్లో వచ్చే చర్మంపై ముడతలు, కళ్లకింద నల్లని మచ్చలు కూడా మునగాకు తినడం వల్ల తగ్గిపోతాయని చెబుతున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి